Fri Dec 05 2025 11:30:57 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Australia : చేసిదంతా చేసి ఎట్లా చూస్తున్నాడో చూడండి
భారత్ ఆస్ట్రేలియాతో్ జరుగుతున్న వన్డే సిరీస్ ను చేజార్చుకుంది. పెర్త్, ఆడిలైడ్ మ్యాచ్ లలో భారత్ ఓటమి పాలయింది.

భారత్ ఆస్ట్రేలియాతో్ జరుగుతున్న వన్డే సిరీస్ ను చేజార్చుకుంది. పెర్త్, ఆడిలైడ్ మ్యాచ్ లలో భారత్ ఓటమి పాలయింది. దీంతో సిరీస్ ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకుంది. మూడో మ్యాచ్ శనివారం జరగనుంది. అయితే ఈ ఓటమిలో టీం ఇండియా ఆటగాళ్లు ఎంత కారణమో జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఒక కారణమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. హెచ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఇగోలకు పోతూ తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ లను చేజారుస్తున్నాయని అంటున్నారు. ఇటీవల ఆసియాకప్ లో భారత్ విజయం సాధించిన తర్వాత గౌతమ్ గంభీర్ తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.
కులదీప్ ను పక్కన పెట్టి...
చైనామన్ బౌలర్ కులదీప్ యాదవ్ ను పక్కన పెట్టినందునే రెండు మ్యాచ్ లను భారత్ చేజార్చుకోవాల్సి వస్తుందన్నది చేదునిజం. ఎందుకంటే మాజీ క్రీడాకారులు పనిగట్టుకుని చెబుతున్నారు. సిరీస్ కు ముఖ్యమైన రెండో మ్యాచ్ లో ఆడిలైడ్ లోనూ కులదీప్ యాదవ్ ను తీసుకోలేదు. తనకు అత్యంత ఇష్టమైన హర్షిత్ రాణాను కొనసాగించాడు. పోనీ హర్షిత్ రాణాను కొనసాగించినా..మరొక బౌలర్ ను తప్పించి కులదీప్ యాదవ్ ను తీసుకుని ఉంటే కొంత వరకూ మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
స్పినర్లకు అనుకూలమని తెలిసినా...
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా రెండో మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసుకోవడంతో పాటు ఆడిలైడ్ మైదానం స్పిన్నర్లకు స్వర్గధామం అని తెలిసినా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లైట్ గానే తీసుకున్నాడు. భారత్ స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసుకున్నారు. అదే కులదీప్ యాదవ్ ఉండి ఉంటే మరికొన్ని వికెట్లు పడేవని, ఖచ్చితంగా ఇండియా గెలుపు సాధ్యమయ్యేదన్న విశ్లేషణలను మాజీ క్రీడాకారులతో పాటు, క్రీడా విశ్లేషకులు అదే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. ఇక సిరీస్ క్లీన్ స్వీప్ కాకుండా ఉండాలంటే శనివారం జరిగే మూడో వన్డేలోనైనా కులదీప్ యాదవ్ ను ఆడిస్తే బాగుంటుందన్నకామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Next Story

