Fri Mar 20 2026 12:57:30 GMT+0530 (India Standard Time)
నేడు ఇండియా - సౌతాఫ్రికా రెండో టెస్ట్
భారత్ దక్షిణాఫిక్రాతో రెండో టెస్ట్ కు సిద్దమయింది. మొదటి టెస్ట్ లో విజయం సాధించిన టీమ్ ఇండియా ఉత్సాహంతో ఉంది.

భారత్ దక్షిణాఫిక్రాతో రెండో టెస్ట్ కు సిద్దమయింది. మొదటి టెస్ట్ లో విజయం సాధించిన టీమ్ ఇండియా ఉత్సాహంతో ఉంది. వాండరర్స్ స్టేడియంలో నేడు రెండో టెస్ట్ జరగనుంది. ఈ పిచ్ భారత్ కు అచ్చొచ్చేదే. కొహ్లి సేన ఇప్పటికే దక్షిణాఫ్రికా పై 1- 0 తేడాతో ఆధిక్యతతో ఉంది. దీంతో రెట్టించన ఉత్సాహంతో భారత్ జట్టు బరిలోకి దిగనుంది.
బలహీనంగా....
మరరోవైపు దక్షిణాఫ్రికా బలహీనంగా కన్పిస్తుంది. బౌలింగ్, బ్యాటింగ్ లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రాణించలేకపోతున్నారు. డీకాక్ రిటైర్మెంట్ కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశమే. ఈ టెస్టు అనేక రికార్డులకు వేదిక కానుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. కొహ్లి పై భారత్ భారీ అంచనాలను పెట్టుకుంది.
Next Story

