Fri Dec 05 2025 12:42:32 GMT+0000 (Coordinated Universal Time)
Asia Cup : నేడు భారత్ - పాక్ మ్యాచ్... టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా?
నేడు ఆసియా కప్ లో మరోసారి భారత్ - పాకిస్తాన్ తలపడుతుంది. దుబాయ్ లో రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

నేడు ఆసియా కప్ లో మరోసారి భారత్ - పాకిస్తాన్ తలపడుతుంది. దుబాయ్ లో రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సూపర్ 4 దశలో జరుగుతున్న ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. గ్రూప్ దశ మ్యాచ్ లో పాకిస్తాన్ పై అలవోకగా విజయం సాధించిన టీం ఇండియా ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచి భారత్ జట్టుపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటుంది. గత ఆదివారమే భారత్ - పాక్ మ్యాచ్ జరిగింది.
వారం తిరక్క ముందే...
వారం రోజులు తిరగక ముందే మరోసారి రెండు జట్లు తలపడుతున్నాయి. అయితే తొలి మ్యాచ్ లో భారత్ గెలిచిన తర్వాత షేక్ హ్యాండ్ వివాదం తలెత్తడంతో ఈ మ్యాచ్ కు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయంటున్నారు. రెండు జట్లు కసి మీద ఉండటంతో ఉత్కంఠ భరితంగానే ఈ మ్యాచ్ సాగుతుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఛేజింగ్ కంటే ముందుగా బ్యాటర్లను అవుట్ చేయాలని ఏ జట్టు అయినా భావిస్తుంది. మరోసారి దుబాయ్ పిచ్ మీద స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు.
Next Story

