Thu Mar 19 2026 10:43:09 GMT+0530 (India Standard Time)
INDvsZIM: ఆఖరి టీ20 లోనూ అదరగొట్టేసిన యువకులు
జింబాబ్వేతో ఆఖరి టీ20 మ్యాచ్ లో 42 పరుగులతో భారతజట్టు ఘనవిజయం

జింబాబ్వేతో ఆఖరి టీ20 మ్యాచ్ లో 42 పరుగులతో భారతజట్టు ఘనవిజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే చేధించలేకపోయింది. 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. పేసర్ ముఖేశ్ కుమార్ 4 వికెట్లు, శివమ్ దూబే 2, తుషార్ దేశ్ పాండే 1, వాషింగ్టన్ సుందర్ 1, అభిషేక్ శర్మ 1 వికెట్ తీశారు. జింబాబ్వే ఇన్నింగ్స్ లో డియాన్ మైర్స్ 34, తదివనాషే మరుమని 27, ఫరాజ్ అక్రమ్ 27 పరుగులు చేశారు. మిగిలిన వారంతా విఫలమవ్వడంతో టీమిండియా సునాయాసంగా గెలుపును సొంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ 45 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్ లతో 58 పరుగులు చేశాడు. దూబే 12 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 26, రియాన్ పరాగ్ 22, యశస్వి జైస్వాల్ 12, కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 13, అభిషేక్ శర్మ 14 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని 2, కెప్టెన్ సికిందర్ రజా 1, ఎంగరావా 1, బ్రాండన్ మవుటా 1 వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1తో చేజిక్కించుకుంది
Next Story

