Thu Mar 19 2026 10:44:33 GMT+0530 (India Standard Time)
భారీ స్కోరు... చితక్కొడితేనే సాధ్యమా?
భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది.385 పరుగులను చేసింది

భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది.385 పరుగులను చేసింది. 9 వికెట్లను కోల్పోయి 385 పరుగులు చేసింది. న్యూజిలాండ్ లక్ష్యం 386 పరుగులుగా ఉంది. భారీ లక్ష్యం విధించడంతో న్యూజిలాండ్ చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత్ బ్యాటర్లలో...
భారత్ ఓపెనర్లిద్దరూ సెంచరీలు చేశారు.. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు ఇద్దరూ సెంచరీలు సాధించండతో భారత్ భారీ స్కోరు సాధించింది. తర్వాత వచ్చిన బ్యాటర్లలో విరాట్ కొహ్లి 36 పరుగులు చేసి అవుట్ కాగా, సూర్యకుమార్ యాదవ్ తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన హార్థిక్ పాండ్యా అర్థ సెంచరీ పూర్తి చేయడంతో భారత్ భారీ స్కోరును సాధించగలిగింది.
- Tags
- india
- new zealand
Next Story

