Fri Jan 30 2026 03:09:55 GMT+0000 (Coordinated Universal Time)
India vs England : మూడో మ్యాచ్ లో ఇద్దరు సెంచరీలు.. భారత్ భారీ స్కోరు దిశగా
భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్ లో టీం ఇండియా కుదుట పడింది. రోహిత్ శర్మ, జడేజాలు సెంచరీలు చేశారు

భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్ లో టీం ఇండియా కుదుట పడింది. తొలుత మూడు వికెట్లు వెంటవెంటనే కోల్పోయినా తర్వాత ఆటగాళ్లు నిలదొక్కుకోవడంతో భారీ స్కోరు దిశగా టీం ఇండియా పయనిస్తుంది. ప్రస్తుతం భారత్ స్కోరు ఐదు వికెట్లు కోల్పోయి 315 పరుగులు సాధించింది. రాజ్కోట్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఓవర్లలో తడబడినా తర్వాత నిలదొక్కుకుని తేరుకోగలిగింది.
జడేజా, రోహిత్ లు...
అయితే సొంత గడ్డపై ఆల్ రౌండర్ జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ మ్యాచ్ లలో జడేజాకు ఇది నాల్గో సెంచరీ, 198 బంతుల్లో సెంచరీ సాధించిన జడేజా భారత్ కు భారీ స్కోరు సాధించిపెట్టడంలో కీలక భూమిక పోషించాడు. దీంతో పాటు తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో అరగ్రేటం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అర్ధ సెంచరీ చేశాడు. తర్వాత ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు. అత్యంత వేగంగా సర్ఫరాజ్ ఖాన్ అర్థశతకాన్ని సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 131 పరుగులు చేసి భారత్ అత్యధిక పరుగులు చేయడానికి దోహదపడ్డాడు.
Next Story

