Fri Mar 20 2026 18:11:50 GMT+0530 (India Standard Time)
తొలి ఇన్నింగ్స్ లో ఇండియాదే ఆధిక్యం
భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యాన్ని కనపర్చింది

భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యాన్ని కనపర్చింది. రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో భారత్ 87 పరుగుల ఆధిక్యాన్ని కనపర్చింది. భారత్ జట్టులో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లు సెంచరీలు మిస్ చేసుకున్నారు. రిషబ్ పంత్ 93 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 87 పరుగులు చేసి అవుటయ్యారు. దీంతో భారత్ 314 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
ఆట ముగిసే సమయానికి...
తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 227 పరుగులు చేసింది. అంటే 87 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు పరుగులు చేసింది. వికెట్లు ఏమీ కోల్పోకుండా ఆరు ఓవర్లను పూర్తి చేసుకున్న తర్వాత ఆట ముగిసింది. క్రీజ్ లో ప్రస్తుతం జకీర్ హసన్, షాంబోలు ఉన్నారు.
- Tags
- india
- bangladesh
Next Story

