Fri Dec 05 2025 11:28:29 GMT+0000 (Coordinated Universal Time)
Asia Cup : ఆసియా కప్ లో ఓటమి ఎరుగని భారత్.. శ్రీలకంను సూపర్ ఓవర్ లో ఓడించి
ఆసియా కప్ లో నామమాత్రమైన శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోనూ సూపర్ ఓవర్ లో చివరకు టీం ఇండియానే జయం వరించింది.

ఆసియా కప్ లో టీం ఇండియాకు ఎదురులేదు. కాస్త ఇబ్బందులైనా విజయంలో మాత్రం తమకు తిరుగులేదని మరొకసారి నిరూపించింది. ఇప్పటి వరకూ ఆసియా కప్ లో లీగ్ మ్యాచ్ లో కానీ, సూపర్ 4 మ్యాచ్ లలో టీం ఇండియాకు ఓటమి అనేది ఎరుగదు. ఆసియా కప్ లో నామమాత్రమైన శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోనూ సూపర్ ఓవర్ లో చివరకు టీం ఇండియానే జయం వరించింది. సూపర్ ఓవర్ వరకూ రావడం ఒక ఎత్తైతే అందులో భారత్ దే ఆధిపత్యం అయిది. దీంతో ఆసియా కప్ లో ఇప్పటి వరకూ ఓటమి అనేది ఎరుగ కుండా టీం ఇండియా ప్రయాణం సాగుతుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో భారత్ తలపడుతుంది.
తొలిసారి 200 పరుగులు దాటి...
ఆసియా కప్ లో మరోసారి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొట్టమొదటి సారి రెండు వంద పరుగుల మార్క్ దాటింది. మరొకసారి అభిషేక్ శర్మ తన బ్యాట్ కు పనిచెప్పాడు. అభిషేక్ శర్మ 61 పరుగులు చేసిభారత్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. శుభమన్ గిల్ నాలుగు పరుగులకే అవుటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా పన్నెండు పరుగులు చేసి వెనుదిరగడంతో హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ 49 పరుగులు చేసి భారత్ స్కోరును పరుగులు పెట్టించాడు. శాంసన్39 పరుగులు చేశాడు. హార్ధిక్ పాండ్యా రెండు, అక్షర్ పటేల్ 21 పరుగులు చేశాడు. భారత్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేయగలిగింది. ఆసియా కప్ లో భారత్ కు ఇదే అత్యధిక స్కోరు.
సమంగా చేయడంతో సూపర్ ఓవర్ కు...
తర్వాత శ్రీలంక బ్యాటింగ్ కు దిగి నిశాంక 107 పరుగులు చేసి స్కోరును పరుగులు తీయించాడు. కుశాల్ మెండిస్ డకౌట్ అయ్యాడు. కుశాల్ పెరీరా 58 పరుగులు చేశాడు. అసలంక ఐదు పరుగులు, మెండిస్ మూడు, శానక 22పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కు ఆసియా కప్ లో తొలిసారిచేరింది. సూపర్ ఓవర్ లో అర్షదీప్ చేసిన బౌలింగ్ భారత్ కు కలసి వచ్చింది. ఐదు బాల్స్ వేసిన అర్షదీప్ రెండు వికెట్లు తీశాడు. తొలి బంతికే కుశాల్ పెరీరా ఒక పరుగుకు అవుట్ కాగా, నాలుగో బాల్ కు శానకను రనౌట్ చేశఆడు. దీంతో లంక ఇన్నింగ్స్ ఐదు బంతుల్లో రెండు పరుగులకేముగిసింది. భారత్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెండు పరుగులను వికెట్ కోల్పోకుండా ఛేదించి విజయం దక్కించుకుంది.
Next Story

