Mon Feb 02 2026 02:05:51 GMT+0000 (Coordinated Universal Time)
కీలక వికిెట్లు కోల్పోయిన టీం ఇండియా
భారత్ - న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు ఆదిలోనే తడబడుతున్నారు. కీలక మైన వికెట్లను టీం ఇండియా కోల్పోయింది

భారత్ - న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు ఆదిలోనే తడబడుతున్నారు. కీలక మైన వికెట్లను టీం ఇండియా కోల్పోయింది. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో భారత్ పడిందనే చెప్పాలి. ఎప్పటిలాగానే రిషబ్ పంత్ విఫలమయ్యాడు. పది పరుగులు చేసి అవుటయ్యాడు. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. పంత్ అనవసరమైన షాట్ కొట్టి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
మూడు వికెట్లు ....
టీం ఇండియా 21 ఓవర్లకు 87 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. శిఖర్ ధావన్ 28 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ శుభమన్ గిల్ 13 పరుగులు చేసి అవుటడయ్యాడు. దీంతో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యార్ ఆడుతున్నారు. భారీ స్కోరు చేయాల్సిన పరిస్థితుల్లో మూడు కీలక మైన వికెట్లు కోల్పోవడం భారత్ కష్టాల్లో పడినట్లయింది. న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది.
- Tags
- new zealand
- india
Next Story

