Tue Feb 10 2026 00:47:01 GMT+0530 (India Standard Time)
India vs Pakistan : ఐసీసీ పాక్ షరతులు అంగీకరిస్తుందా? భారత్ తో పాక్ మ్యాచ్ జరిగేనా?
టీ20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పై సందిగ్దత ఇంకా తొలగలేదు

టీ20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పై సందిగ్దత ఇంకా తొలగలేదు. అయితే ఐసీసీ పాకిస్తాన్ 24 గంటల డెడ్ లైన్ పెట్టింది. ఈ నెల 15వ తేదీన కొలొంబో వేదికగా భారత్ - పాక్ మ్యాచ్ జరగాల్సి ఉండగా తాము ఆ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సయితం తమ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. దీంతో ఐసీసీ మ్యాచ్ ఆడకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరికలు జారీ చేసింది.
ఐసీసీ, పీసీబీ చర్చల మధ్య...
భారత్ - పాక్ మ్యాచ్ జరిగితే ఐసీసీ వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. దాదాపు 4,500 కోట్ల ఆదాయం వరకూ రానుండటంతో ఐసీసీ ఈ ఆదాయాన్ని వదులకునేందుకు సిద్ధంగా లేదు. అందుకోసం పాక్ క్రికెట్ బోర్డుపై వత్తిడి తెస్తోంది. హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో లాహోర్ లో పీసీబీఛైర్మన్ మోసిన్ నఖ్వీ, ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజాతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాంలు సమావేశమయ్యారు. కానీ వీరి మధ్య ఐదు గంటల పాటు చర్చలు జరిగినా ఇంకా పాకిస్తాన్ మాత్రం భారత్ తో ఆడేందుకు సుముఖం వ్యక్తం చేయడం లేదు.
ఇరవై నాలుగు గంటలు...
అయితే పాకిస్తాన్ మాత్రం తాము భారత్ తో ఆడాలంటే అందుకు ఐసీసీకి మూడు షరతులు విధించిందంటున్నార. బంగ్లాదేశ్ క్రికెట్ అభివృద్ధి ఐసీసీ నుంచి మరిన్ని నిధులు ఇవ్వాలని, టీ 20లో ప్రపంచ కప్ లో పాల్గొనకపోయినా బంగ్లాదేశ్ పార్టిసిపేషన్ ఫీజు మంజూరు చేయాలని, భవిష్యత్ లో బంగ్లాదేశ్ కు ఐసీసీ ఈవెంట్ ఆతిధ్యహక్కులు ఇవ్వాలని కండిషన్ పెట్టింది. అయితే ఈ కండిషన్లకు ఐసీసీ అంగీకారం తెలపకుండానే ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ విధించింది. దీంతో పాక్ మనసు మార్చుకుని భారత్ తో ఈ నెల 15వ తేదీన మ్యాచ్ ఆడనుందా? లేదా? అన్నది తెలియనుంది.
Next Story

