Sun Dec 08 2024 00:04:41 GMT+0000 (Coordinated Universal Time)
జాబితాలో ముగ్గురికే చోటు
టీ 20లో ప్రపంచ అత్యుత్తమ జట్టును ఐసీసీ ప్రకటించింది. 2022 సంవత్సరానికి ఈ జట్టును ఎంపిక చేసింది
టీ 20లో ప్రపంచ అత్యుత్తమ జట్టును ఐసీసీ ప్రకటించింది. 2022 సంవత్సరానికి ఈ జట్టును ఎంపిక చేసింది. ఇందులో ముగ్గురు టీం ఇండియా క్రికెటర్లకు చోటు లభించింది. విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా ఈ జాబితాలో ఉన్నారు. గత ఏడాది ఆటతీరును పరిగణనలోకి తీసుకుని ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత్ తర్వాత ఇంగ్లండ్, పాకిస్థాన్ నుంచి ఇద్దరేసి చొప్పున ఈ జాబితాల చోటు లభించింది.
భారత్ కే ముగ్గురే...
మొత్తం 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా అందులో జోస్ బట్లర్ (ఇంగ్లండ్, కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), విరాట్ కొహ్లి (భారత్), సూర్యకుమార్ యాదవ్ (భారత్) హార్థిక్ పాండ్యా (భారత్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), సికిందర్ రాజా (జింబాబ్వే), సామ్ కరన్ (ఇంగ్లాండ్)వానిందు హసరంగ (శ్రీలంక), హారిస్ రవూఫ్ (పాకిస్థాన్), జోష్ లిటిల్ (ఐర్లాండ్) లు ఎంపికయ్యారు. మహిళ క్రికెట్ జట్టును కూడా ప్రకటించింది. ఇందులో స్మృతి మందాన, దీప్తి శర్మ, రిచా ఘోష్ లకు చోటు దక్కింది.
Next Story