Thu Jul 17 2025 00:14:25 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ఏం లాభం? గెలిచి లక్నోను ఇంటిదారి పట్టించిన హైదరాబాద్
లక్నోలో జరిగిన హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించింది.

ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. ప్లే ఆఫ్ రేసులో ఏ ఏ జట్లు ఉంటాయన్న క్లారిటీ క్రమంగా వచ్చేసింది. ఇప్పటికే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. నాలుగో జట్టు మాత్రం ఇంకా తేలలేదు. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ కాపిటల్స్ మధ్య పోటీ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న లక్నోలో జరిగిన హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించింది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుని ఇంటి దారి పట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎప్పుడో ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించి తనతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ను కూడా తీసుకెళ్లింది.
మంచి ఆరంభాన్ని అందించినా...
లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ లో పన్నెండు మ్యాచ్ లు ఆడి కేవలం ఐదింటిలో మాత్రమే గెలిచింది. ఏడింటిలో ఓడిపోవడంతో పదిపాయింట్లకే పరిమితమయింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ మంచి స్కోరు సాధించింది. ఓపెనర్లు ఇద్దరూ అదిరేటి ఆరంభాన్ని అందించారు. మార్ష్ 65 పరుగులు చేసి అవుటయ్యాడు. మార్ క్రమ్ కూడా 61 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ రిషబ్ పంత్ ఎప్పటిలాగానే ఏడు పరుగులు చేసి అవుటయ్యాడు. పూరన్ 45 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. బదోనిమూడు, సమద్ మూడు, శార్దూల్ నాలు పరుగులు చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
భారీ లక్ష్యాన్ని...
205 పరుగుల లక్ష్యమంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రస్తుతం ఉన్న ఫామ్ లో మంచి టార్గెట్ అని చెప్పాలి. అయితే తొలుత ఓపెనర్ గా దిగిన అధర్వ 13 పరుగులకే అవుటయ్యాడు. అభిషేక్ శర్మ యాభై తొమ్మిది పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 35 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. క్లాసెన్ 47 పరుులు, కమిందు మెండిస్ 32, అనికేత్ ఐదు, నితీష్ కుమార్ ఐదు పరుగులు చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలిగింది.సన్ రైజర్స్ హైదరాబాద్ 18,2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. తనతో పాటు క్నోను కూడా ఇంటికి తీసుకెళ్లగలిగింది.
Next Story