Sat Dec 06 2025 03:00:48 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెట్ ఫీవర్ పై రెయిన్ ఎఫెక్ట్
విశాఖలో భారీ వర్షం మొదలయింది. రేపటి వన్డే మ్యాచ్ కు వర్షం అంతరాయం కల్గించే అవకాశముందని చెబుతున్నారు

విశాఖలో భారీ వర్షం మొదలయింది. వానకు తోడు గాలికి తోడయింది. దీంతో రేపు విశాఖలో జరగనున్న వన్డే మ్యాచ్ పై అనుమానాలు మొదలయ్యాయి. రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో మ్యాచ్ జరగడం పై సందేహం కలుగుతుంది. రేపటి మ్యాచ్ కు వర్షం అంతరాయం కల్గించే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.
విశాఖలో భారీ వర్షం...
టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. అయితే రేపటి మ్యాచ్ ఆడేందుకు ఇండియా- ఆస్ట్రేలియా జట్లు విశాఖకు చేరుకున్నాయి. దీంతో విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలయింది. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్రికెటర్లు విమానాశ్రయం నుంచి నేరుగా రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్ కు చేరుకున్నాయి. దీంతో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

