Wed May 21 2025 02:50:26 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : గుజరాత్ కు తిరుగులేదు... కోల్ కత్తాకు ఓటమి తప్పలేదు
కోల్ కత్తాలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

ఐపీఎల్ ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ దూసుకు పోతుంది. విజయాలను వరసగా తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే.. వేదిక ఎక్కడైనా సరే తమదే విజయం అన్న రీతిలో టైటాన్స్ ప్రయాణం సాగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చూపుతూ పాయింట్ల పట్టికలో ఇప్పటికే టాప్ పొజిషన్ కు చేరిన గుజరాత్ టైటాన్స్ తో పోటీ అంటేనే మిగిలిన జట్లు కూడా జంకే పరిస్థితి ఏర్పడింది. అలా ఆడుతున్నారు. తక్కువ పరుగులు చేసినా, ముందు ఫీల్డింగ్ చేసినా, లేదా బ్యాటింగ్ చేసినా సరే మైదానంలో చివరకు గుజరాత్ టైటాన్స్ దే పై చేయిగా మారుతుంది. నిన్న కోల్ కత్తాలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
ఓపెనర్లు స్ట్రాంగ్ గా...
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ల భాగస్వామ్యాన్ని చాలా వరకూ కోల్ కత్తా బౌలర్లు విడదీయలేకపోయారు. దీంతో ఓపెనర్లుగా దిగిన సాయి సుదర్శన్ 52 పరుగులు చేయగగా, శుభమన్ గిల్ 90 పరుగులు చేశాడు. చివరకు సుదర్శన్ ను రస్సెల్ బౌలింగ్ లో అవుట్ చేయగలిగినా తర్వాత వచ్చిన బట్లర్ మరోసారి ఉతికి పారేశాడు. బట్లర్ ఈసారి 41 పరుగులు మాత్రమే చేసినా విలువైన రన్స్ ను జట్టుకు జోడించాడు. తెవాతియా పదకొండు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తం ఇరవై ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేయగలిగింది. వైభవ్, హర్షిత్ రాణా, రస్సెల్ తలో వికెట్ మాత్రమే తీయగలిగారు.
ఛేదించడానికి...
లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇది పెద్ద స్కోరు అని చెప్పాలి. అయితే సొంత మైదానం కావడంతో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని అందరూ భావించారు. కానీ మ్యాజిక్ జరగకపోగా కోల్ కత్తా నైట్ రైడర్స్ కు మ్యూజిక్ మాత్రమే మిగిలింది. గుర్బాజ్ ఒక పరుగుకే అవుటయ్యాడు. రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి యాభై పరుగులు చేయగలిగాడు. వెంకటేశ్ అయ్యర్ పథ్నాలుగు పరుగులకు మాత్రమే పరిమతమయ్యాడు. రింకూ సింగ్ పదిహేడు పరుగులు, రసెల్ 21, రమణ్ దీప్ ఒక పరుగు, రఘువంవీ 27 పరుగులు చేయగలిగారు. మొత్తం ఇరవై ఓవర్లలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా మరో ఓటమిని మూటగట్టుకుంది. గుజరాత్ జెండాను ఎగురవేయగలిగింది.
Next Story