Wed Apr 08 2026 11:16:08 GMT+0530 (India Standard Time)
IPL 2026 : నేడు ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్
నేడు ఐపీఎల్ లో ఢిల్లీ కాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది

ఐపీఎల్ లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ కాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ టైటాన్స్ జరిగే మ్యాచ్ లో మాత్రం గెలుపుపై అనేక అంచనాలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ దే పై చేయి...
ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ కాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి ఫుల్ ఫామ్లో ఉంది. గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు ఏడు సార్లు తలపడగా, గుజరాత్ టైటాన్స్ నాలుగు విజయాలతో పైచేయి సాధించింది. అయితే రెండు జట్లతో పోలిస్తే టైటాన్స్ బలహీనంగానే కనపడుతుంది.
Next Story

