Thu Jul 17 2025 00:40:18 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : అదరగొట్టిన గుజరాత్ .. సొంతమైదానంలో ముంబయి ఓటమి
వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ లో ఆరంభంలో కొంత ఒత్తిడికి గురయి తర్వాత తేరుకుని విజయాల బాట పట్టిన ముంబయి ఇండియన్స్ కు గుజరాత్ టైటాన్స్ దెబ్బతీసింది. సొంత మైదానమైన ముంబయిలోని వాంఖడే స్టేడియంలో తమకు తిరుగులేదని భావించిన ముంబయి ఇండియన్స్ పై టైటన్స్ దే పై చేయి అయింది. అయితే వర్షం కూడా గుజరాత్ కు కలసి వచ్చింది. ఇన్నాళ్లూ తమకు తమకు తిరుగులేదని భావించిన ముంబయి ఇండియన్స్ జట్టును ఓడించి గుజరాత్ టైటాన్స్ తమకు ఈ సీజన్ లో ఎదురులేదని నిరూపించుకుంది. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తక్కువ పరుగులు చేసి...
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ జట్టులో రికిల్ టన్న రెండు పరుగులకే బౌలర్ సిరాజ్ అవుట్ చేశాడు. తర్వాత మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఏడు పరుగులకే అవుటయ్యాడు. అయితే ఇరవై ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబయి ఇండియన్స్ ను జాక్స్, సూర్యకుమార్ యాదవ్ లు సరిదిద్దే ప్రయత్నం చేశారు. స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. జాక్స్ యాభై పరుగులు, సూర్యకుమార్ 35 పరుగులు చేసి అవుటయిన వెంటనే ఇక ముంబయి ఇండియన్స్ లో ఎవరూ పెద్దగా క్రీజులో నిలబడలేకపోయారు. తిలక్ వర్మ ఏడు, హఆర్థిక్ ఒకటి, నమన్ ధీర్ ఏడు, బోష్ రనౌట్, దీపక్ చాహర్ ఎనిమిది పరుగులు చేశారు. మొత్తం ఇరవై ఓవర్లలో ముంబయి ఇండియన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.
వర్షం కారణంగా...
ఇక తర్వాత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఇది పెద్ద స్కోరు కాదు. అయితే సాయి సుదర్శన్ ఈ సీజన్ లో అత్యంత తక్కువ పరుగులు ఐదు చేసి అవుటయ్యాడు. గిల్ 43 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. బట్లర్ కూడా ముప్ఫయి పరుగులు చేసి వెనుదిరిగాడు. రూధర్ ఫర్డ్ ఇరవై ఎనిమిది పరుగులు చేసి వెనుదిరిగగా, షారుఖ్ ఖాన్ ఆరు, తెవాతియా పదొకకొండు పరుగులు చేశాడు . మొత్తం పందొమ్మిది ఓవర్లలోనే గుజరాత్ టైటాన్స్ 147 పరుగులు చేసింది. వర్షం కారణంగా మూడు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా, ముంబయి నాలుగో స్థానానికి పడిపోయింది.
Next Story