Thu Apr 09 2026 10:18:58 GMT+0530 (India Standard Time)
IPL 2026 : టైటాన్స్ సూపర్ విక్టరీ.. ఢిల్లీపై ఒక్క పరుగుతోనే?
ఢిల్లీ కాపిటల్స్ ఈ సీజన్ లో తొలి ఓటమి చవి చూసింది

ఢిల్లీ కాపిటల్స్ ఈ సీజన్ లో తొలి ఓటమి చవి చూసింది. అలాగే గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్నిసాధించింది. రెండు జట్లు హోరాహోరాగా మైదానంలో పోరాడాయి. చివరకు గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగుతో వియం సాధించింది. దీంతో ఢిల్లీని ఓడించిన గుజరాత్ టైటాన్స్ కు ఒక రకంగా లక్కు కలసి వచ్చినట్లయింది.బుధవారం జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ ఉత్కంఠ రేపింది. ఆ క్షణాల్లో డేవిడ్ మిల్లర్ తీసుకున్న ఒక నిర్ణయం ఢిల్లీ కాపిటల్స్ ను తీవ్రంగా దెబ్బతీసింది.
పదమూడు పరుగులు కావాల్సి ఉండగా...
చివరి ఓవర్‌కు పదమూడు పరుగులు కావాల్సి ఉండగా బౌలింగ్‌కు వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ పెనాల్టిమేట్ బంతికి ముందు మిల్లర్ సింగిల్ తీసుకోలేదు. భాగస్వామి కుల్ దీప్ యాదవ్ పై నమ్మకం లేకపోవడం దీనికి కారణంగా కనిపించింది. ఆ బంతికి ప్రసిద్ధ్ నెమ్మదైన డెలివరీ వేయగా మిల్లర్ మిస్ అయ్యాడు. అప్పటికే ఒక గ్లౌవ్ తీసేసుకున్న బట్లర్స్ స్టంప్స్ కొట్టేశాడు. క్రీజ్ చేరకముందే కుల్దీప్ ఔటయ్యాడు. దీంతో 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఢిల్లీ 209 పరుగుల వద్ద ఎనిమిది వికెట్లతో ఆగిపోయింది.
బ్యాటింగ్ మెరుపులు...
ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. బట్లర్ 27 బంతుల్లో 52 పరుగులతో ధాటిగా ఆడాడు. కెప్టెన్ శుభమన్ గిల్ 70 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 32 బంతుల్లో 55 పరుగులు చేసి స్కోరు వేగంగా నడిపించారు. పవర్‌ప్లేలోనే బట్లర్ ఐదు సిక్సర్లు బాదాడు. వాటిలో నాలుగు ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో వచ్చాయి. ఒకటి ఫైన్‌లెగ్ మీదుగా, మరొకటి గౌతమ్ గంభీర్ స్టాండ్ టాప్ టియర్ చేరింది. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 68 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది.
గిల్ దూకుడు...
బట్లర్ ఔటైన తర్వాత గిల్ బాధ్యత తీసుకున్నాడు. కుల్దీప్ బౌలింగ్‌పై స్లాగ్ స్వీప్‌లతో నాలుగు సిక్సర్లు కొట్టాడు. మధ్యలో వాషింగ్టన్ స్పిన్నర్లపై దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా విప్రజ్ నిగమ్ వేసిన ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. నాటరాజన్ బంతికి డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టి అర్ధశతకం పూర్తి చేశాడు.161/2 వద్ద 15 ఓవర్లకు గుజరాత్ 220 దాటుతుందనిపించినా చివర్లో కొంత తగ్గింది. ఢిల్లీ బౌలర్లలోలుంగి న్గిడినాలుగు ఓవర్లలో 24 పరుగులకే ఒక వికెట్ తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
లక్ష్య ఛేదనలో...
లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ 52 బంతుల్లో 92, పాతుమ్ నిస్సాంక 24 బంతుల్లో 41 పరుగులు చేసి 49 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాచ్ ఢిల్లీ వైపు తొంగిచూసినట్లు కనిపించింది. అయితే మధ్య ఓవర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసి ఆట మలుపు తిప్పాడు. చివరికి మిల్లర్ 20 బంతుల్లో 41 పరుగులతో పోరాడినా, ఆ ఒక్క సింగిల్ నిరాకరణే ఢిల్లీ ఓటమికి కారణమైంది.ఈ సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. గుజరాత్ మాత్రం మూడో మ్యాచ్‌లో పూర్తి పాయింట్లు సాధించింది.
Next Story

