గొప్ప నిర్ణయం.. ఐపీఎల్ ఫైనల్ కు త్రివిధ దళాధిపతులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ జూన్ 3వ తేదీన అహ్మదాబాద్‌లో జరగనుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ జూన్ 3వ తేదీన అహ్మదాబాద్‌లో జరగనుంది. ఆ ఫైనల్ కు త్రివిధ దళాలకు చెందిన అధిపతులకు బీసీసీఐ ఆహ్వానం పంపింది. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతీయ రక్షణ దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూర్‌లో ధైర్యసాహసాలను ప్రదర్శించిన సైనికులకు నివాళి అర్పించేందుకు బీసీసీఐ ఐపీఎల్ ను వేదికగా చేసుకుంది. ఐపీఎల్ ఫైనల్‌కు త్రివిధ దళాధిపతులను ఆహ్వానించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ డిఫెన్స్‌కు చెందిన టాప్ ఆఫీసర్లను, సైనికులను ఫైనల్‌కు ఆహ్వానించారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత సైన్యంలోని ఉన్నతాధికారులు, సైనికులను ఐపీఎల్ ఫైనన్ కు ఆహ్వానం పలకాలని నిర్ణయించాం. ఉగ్ర దాడి నేపథ్యంలో వారు చూపిన ధైర్య సాహసాలు అనన్య సమాన్యమైనవని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొనియాడారు.