Sun Dec 14 2025 00:24:27 GMT+0000 (Coordinated Universal Time)
Pratheeka : గూస్ బంప్స్ తెప్పించే ఘటన... ప్రతీకను అభినందించకుండా ఎలా ఉంటాం?
భారత మహిళల క్రికెట్ జట్టు తొలి ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను ఎత్తుకున్న క్షణంలో ఒక ఘటన గూస్ బంప్స్ తెప్పించింది. వీల్ ఛైయిర్ లో వచ్చినా ప్రతీక రవాల్ కన్నీళ్లతో చిరు నవ్వు నవ్వింది

భారత మహిళల క్రికెట్ జట్టు తొలి ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను ఎత్తుకున్న క్షణంలో ఒక ఘటన గూస్ బంప్స్ తెప్పించింది. వీల్ ఛైయిర్ లో వచ్చినా ప్రతీక రవాల్ కన్నీళ్లతో చిరు నవ్వు నవ్వింది. బంగ్లాదేశ్‌పై జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కాలి గాయంతో టోర్నీలోంచి తప్పుకున్న 24 ఏళ్ల ప్రతిక ఆ సాయంత్రం వీల్‌చైర్‌లో జట్టుతో కలిసి జెండా కప్పుకొని సంబరాల్లో పాల్గొంది. జట్టు సభ్యులు ఆనందంగా ఆమెను కౌగిలించుకున్నారు. ఫైనల్ టీం లో లేకపోయినా తమ జట్టుగానే భావించి వారంతా అక్కున చేర్చుకోవడంతో ప్రతిక ఆనందానికి అవధులు లేవు. స్వయంగా ఆమెను వీల్ ఛైర్ లో తీసుకు వచ్చి సంబరాల్లో పాల్గొనేలా చేసి ఆమెకు ఇచ్చిన గౌరవం, ప్రతికపై జట్టు కురిపించిన ప్రేమను చూస్తుంటే హృదయమున్న వారికి ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.
గాయంతో వైదొలిగి...
గాయం కాకముందు అద్భుత ఫాంలో ప్రతిక రవాల్ ఉన్నారు. 308 పరుగులతో భారత జట్టులో రెండవ అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఆమె ఒక శతకం, ఒక అర్ధశతకం సాధించి జట్టును ఫైనల్ దిశగా నడిపించింది. ఆమె లేని లోటును భర్తీ చేస్తూ ప్రత్యామ్నాయ ఓపెనర్ షఫాలీ వర్మ ఫైనల్లో 87 పరుగులతో మెరిసి భారత స్కోరు 298/7కు చేర్చింది. చివరకు భారత్ దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గాయం కారణంగా ప్రతికా ఆడకపోవడంతోనే షఫాలీ వర్మకు అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని షఫాలీ వర్మ ఉపయోగించుకుంది. అంత మాత్రాన ప్రతీక అంతకు ముందు ఆడిన ఆటతీరును ఎలా మర్చిపోతాం. అందుకే జట్టు సభ్యులందరూ కలసి ఆమెను వరల్డ్ కప్ విజయోత్సవంలో పాల్గొనేలా చేశారు.
విజయోత్సవ సంబరంలో...
నిజానికి ఇంతటి ప్రేమ మరే జట్టులోనూ కనిపించదు. ఒక మహిళల జట్టులోనే మనం చూశాం. అందరూ ఒకటేనని, సమిష్టి విజయంతో వరల్డ్ కప్ సాధించామన్న వారి ఆలోచన ఆ విధంగా నడుచుకునేలా చేసిందని చెప్పాలి. మ్యాచ్ అనంతరం జట్టు ఆనందాన్ని పక్కనే కూర్చొని వీల్‌చైర్‌లోని ప్రతికా కూడా పంచుకుంది. ప్రతి వికెట్, ప్రతి బౌండరీపై ఆమె హర్షధ్వానాలు చేసింది. ఆ తర్వాత జట్టు సభ్యులు ఆమెను మధ్యలో ఉంచి ట్రోఫీతో కూడిన గ్రూప్ ఫోటోలో కన్పించారు. నిజంగా ఆమె జట్టులో లేకపోవచ్చు. కానీ భారత్ వరల్డ్ కప్ నేడు సాధించిందంటే ఆమె భారత జట్టుకు చేసిన కృషిని కూడా పడిన శ్రమను కూడా ఎవరూ మర్చిపోరు. అందుకే ప్రతీకా అంతటి అరుదైన గౌరవం మైదానంలో లభించింది. నిజంగా చూసేవారికి గూస్ బంప్స్ తెప్పించింది
Next Story

