Fri Dec 05 2025 17:45:16 GMT+0000 (Coordinated Universal Time)
ట్విస్ట్ ఏమీ లేదు.. గంభీర్ ఆగయా!!
గౌతమ్ గంభీర్‌ను భారత సీనియర్ పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా నియమించినట్లు

గౌతమ్ గంభీర్‌ను భారత సీనియర్ పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా నియమించినట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు. 42 ఏళ్ల గంభీర్ మొదటి అసైన్మెంట్ లో భాగంగా శ్రీలంకతో భారత జట్టు తలపడనుంది. ఈ సిరీస్ లో 3 వన్డేలు, 3 T20I మ్యాచ్ లు ఉండనున్నాయి. జూలై 27న సిరీస్ ప్రారంభమవుతుంది.
నవంబర్ 2022 - జూన్ 2024 వరకు భారత జట్టు కోచ్ గా పనిచేసిన ద్రావిడ్ నుండి గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. ద్రావిడ్ T20 ప్రపంచ కప్ గెలిచాక బాధ్యతల నుండి వైదొలిగాడు. ద్రవిడ్ నాయకత్వంలో భారతదేశం 2023లో ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, 50 ఓవర్ల ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. 2024లో T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
గంభీర్‌కు గతంలో కోచింగ్ అనుభవం లేదు కానీ పలు IPL టీమ్‌లలో మెంటార్‌గా పనిచేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కు మెంటార్ గా ఉన్నారు. ఆటగాడిగా గంభీర్ 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులోనూ, 2011లో భారతదేశం ఐసీసీ ప్రపంచ కప్ గెలిచిన జట్లలో గంభీర్ ప్లేయర్. 2004 నుండి 2016 వరకు12 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్లో గంభీర్ 58 టెస్టులు, 147 ODIలు, 37 T20I లలో భారత్ కు ఆడాడు.
Next Story

