Fri Dec 05 2025 14:20:22 GMT+0000 (Coordinated Universal Time)
Ind vs Eng Fourth Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే... లేకుంటే సిరీస్ కు శుభం కార్డే
ఇండియా - ఇంగ్లండ్ ల మధ్య నాలుగో టెస్ట్ ఈ నెల 23వ తేదీ నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది.

ఇండియా - ఇంగ్లండ్ ల మధ్య నాలుగో టెస్ట్ ఈ నెల 23వ తేదీ నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది. మొత్తం ఐదు టెస్ట్ ల సిరీస్ లో ఇప్పటి వరకూ మూడు టెస్ట్ లు ముగిశాయి. ఇంగ్లండ్ రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా, భారత్ ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. 2-1 స్కోరుతో ఇంగ్లండ్ జట్టు భారత్ పై ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లలోనూ ఏ ఒక్క మ్యాచ్ కూడా డ్రా కాకుండా విజయంతో రెండు జట్లు ముగించాయి. మరి నాలుగో టెస్ట్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ ను అదిసొంతంచేసుకుంటుంది. భారత్ గెలిస్తే మాత్రం మళ్లీ స్కోర్లు సమం అవుతాయి.
ఇండియాకు కీలకం...
అందుకే మాంచెస్టర్ మ్యాచ్ ఇండియా జట్టుకు కీలకం. ఈ మ్యచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేసి ఐదో మ్యాచ్ లో తేల్చుకోవాలని భావిస్తుంది. అదేసమయంలో ఇంగ్లండ్ కూడా సిరీస్ ముగియక ముందే, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ జట్టు శ్రమిస్తుంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ఇంగ్లండ్ జట్టు స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతుంది. చేతివేలి గాయం కారణంగా మిగిలిపోయిన రెండు టెస్ట్ సిరీస్ కు దూరమైన స్పినర్ షోయబ్ బషీర్ స్థానంలో ఎనిమిదేళ్ల తర్వాత స్పిన్నర్ లియామ్ డాసన్ ను జట్టులోకి తీసుకుని భారత్ ను ఇరకాటంలోకి నెట్టాలని ఇంగ్లండ్ యోచిస్తుంది. మరికొందరిని తప్పించి నాలుగో జట్టులో మార్పులు చేయనుంది ఇంగ్లండ్.
భారత్ కూడా మార్పులతో...
ఇక భారత్ కూడా మార్పులు చేయాల్సిన అవసరముందని అంటున్నారు. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలుపు దక్కాలంటే కొందరిని పక్కన పెట్టాల్సిందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ గడ్డపై గత మూడు మ్యాచ్ లలో విఫలమయిన కరుణ్ నాయర్ ను తప్పించే ఆలోచనలో టీం ఇండియా ఉన్నట్లు తెలసింది. ఈ టూర్ లో కరుణ్ నాయర్ ప్రదర్శన పెద్దగా లేకపోవడంతో కనీస పరుగులు చేయడంతో జట్టుకు నాయర్ భారంగా మారాడు. ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని కరుణ్ నాయర్ వినియోగించుకోలేక పోయాడు. కరుణ్ నాయర్ తో పాటు మరికొందరిపై కూడా నాల్గో టెస్ట్ లో పక్కన పెట్టే అవకాశముందని తెలిసింది. సాయి సుదర్శన్ ను తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. మరి టీంఇండియా మాంచెస్టర్ టెస్ట్ లో జట్టులో ఏరకమైన మార్పులు చేస్తుందన్నది చూడాలి.
Next Story

