Fri Dec 05 2025 14:19:52 GMT+0000 (Coordinated Universal Time)
India Vs England Fourth Test : మాంచెస్టర్ లో టీం ఇండియా వ్యూహం ఇదేనా?
ఇండియా - ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మరో ఆరు రోజుల్లో మాంచెస్టర్ లో ప్రారంభం కానుంది.

ఇండియా - ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మరో ఆరు రోజుల్లో మాంచెస్టర్ లో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే. భారత్ కు ఈ మ్యాచ్ లో గెలపు అవసరం కాగా, ఇంగ్లండ్ కు కూడా సిరీస్ గెలవాలంటే మాంచెస్టర్ లో పరుగుల వరద పాటించాల్సిందే. అందుకే రెండు జట్లు శక్తి కొద్దీ గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకూ మూడు మ్యాచ్ లు జరిగితే ఏ ఒక్క మ్యాచ్ కూడా డ్రా కాకుండా ఎవరో ఒకరు గెలుస్తుండటంతో నాలుగో మ్యాచ్ కూడా గెలుపు తథ్యమని ఇరు జట్లు నమ్మకంగా ఉన్నాయి. డ్రాతో ముగిసినా ఐదో టెస్ట్ కూడా ఇండియా, ఇంగ్లండ్ జట్లు కీలకంగా మారనుంది. ఎటు చూసుకున్నా మాంచెస్టర్ లో జరిగే మ్యాచ్ మాత్రం ఉత్కంఠను రేపుతుంది.
ప్రయోగాలతో ఇంగ్లండ్...
అయితే ఇంగ్లండ్ ఇండియా సిరీస్ స్కోరు 2 -1 ఉండటంతో ఒకింత ఇంగ్లండ్ ప్రయోగాలు చేయవచ్చు. ఈ మ్యాచ్ లో గెలుపోటములను పక్కన పెట్టి ఇంగ్లండ్ ఇండియా బ్యాటర్లను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇంగ్లీష్ జట్టు నింపాదిగా ఉంది. సొంత గడ్డపై సిరీస్ ను కోల్పోకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇంగ్లండ్ టీం బరిలోకి దిగుతుంది. రెండు మ్యాచ్ లు గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ జట్లు నాలుగో మ్యాచ్ ను కూడా సులువుగా తమవైపునకు తిప్పుకోవచ్చని ఖచ్చితంగా అంచనా వేస్తుంది. నిలకడగా ఆడుతున్న బ్యాటర్లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వారిని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు తప్పకుండా చేస్తుంది.
మార్పులతో బరిలోకి...
మరొకవైపు ఇండియా విషయానికి వస్తే కొన్ని మార్పులతో జట్టు బరిలోకి దిగే అవకాశాలున్నాయి. గత మూడు మ్యాచ్ లలో మంచి ప్రదర్శన చేయలేని ఆటగాళ్లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో కరుణ్ నాయర్ ఒకరు. అలాగే బౌలింగ్ లో కూడా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించే యోచన భారత జట్టు చేస్తున్నట్లు తెలిసింది. ఆకాశ్ దీప్ ను నాలుగో మ్యాచ్ లో జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. అలాగే అర్ష్ దీప్ సింగ్ ను తీసుకుంటే ఎలా ఉంటుందన్న దానిపై కూడా టీం ఇండియా మేనేజ్ మెంట్ ఆలోచిస్తునట్లు చెబుతున్నారు. ఇక బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు అదనపు పరుగులు ఇవ్వకుండా ఉండటంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్ లో తడబడకుండా వికెట్లను నిలబెట్టుకునేలా వ్యూహంతో టీం ఇండియా మాంచెస్టర్ మ్యాచ్ లోకి దిగనుంది.
Next Story

