Wed Jan 28 2026 07:16:54 GMT+0000 (Coordinated Universal Time)
India vs Newzeland : నేడు భారత్ - న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్
భారత్ - న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 నేడు విశాఖ వేదికగా జరగనుంది

భారత్ - న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 నేడు విశాఖ వేదికగా జరగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఇప్పటికే విశాఖకు చేరుకుని ప్రాక్టీస్ ను ప్రారంభించాయి. ఇప్పటికే మూడు టీ20లను టీం ఇండియా గెలుచుకుని సిరీస్ ను సొంతం చేసుకుంది. మూడు నాగపూర్, రాయపూర్, గౌహతిలో జరిగిన మ్యాచ్ లలో టీం ఇండియా వరసగా విజయం సాధించడంతో పాటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ పరంగా భారత్ బలంగా ఉంది. టీ 20లలో ప్రపంచంలోనే మేటిజట్టుగా ఉంది.
వైట్ వాష్ చేయాలని...
అయితే విశాఖలో జరిగే మ్యాచ్ లోనూ గెలిచి భారత్ తన సత్తా చాటాలని భావిస్తుంది. వన్డే సిరీస్ ను కోల్పోయిన భారత జట్టు టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. వన్డే సిరీస్ ను కోల్పోయిన టీం ఇండియా ప్రతీకారంతో టీ20 సిరీస్ ను వైట్ వాష్ చేయాలనుకుంటుంది. మరొకవైపు న్యూజిలాండ్ కూడా సిరీస్ ను కోల్పోయినా విశాఖ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. భారత్ తొలుత బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా తాము గెలవలేకపోవడంపై ఇప్పటికే కివీస్ పోస్టుమార్టం చేసుకుని మైదానంలోకి దిగుతోంది.
మార్పులతో బరిలోకి...
ఈరోజు విశాఖలో జరిగే మ్యాచ్ లో భారత్ జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. తిలక్ వర్మ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది. సంజూ శాంసన్ ను తప్పించి మరొకరికి అవకాశం ఇస్తారా? లేదా శాంసన్ ను కొనసాగిస్తారా? అన్నది చూడాలి. మరొకవైపు సిరీస్ గెలవడంతో కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో జట్టు మేనేజ్ మెంట్ ఉంది. న్యూజిలాండ్ కూడా స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతుంది. మరి విశాఖ లో నేడు జరిగే మ్యాచ్ లో ఎవరిది గెలుపన్నది చూడాల్సి ఉంది.
Next Story

