Wed Dec 17 2025 06:35:49 GMT+0000 (Coordinated Universal Time)
India vs South Afrcia : నేడు భారత్ - దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్
నేడు భారత్ - దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది

నేడు భారత్ - దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్ లలో 2-1 ఆధిక్యతతో భారత్ కొనసాగుతుంది. ఈరోజు భారత్ గెలిస్తే సిరీస్ ఒక మ్యాచ్ కు ముందే సొంతం చేసుకునే అవకాశముంది.
స్వల్ప మార్పులతో...
దక్షిణాఫ్రికా గెలిస్తే మాత్రం సిరీస్ సమంగా ఉంటుంది. లక్నోలో జరిగే మ్యాచ్ లో భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అలాగే దక్షిణాఫ్రికా జట్టులోనూ కొన్ని మార్పులు ఉండే అవకాశాలున్నాయి. అయితే లక్నోలో ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచ్ లో భారత్ కు విజయం దక్కింది. అందుకే ఈ మ్యచ్ కీలకం కానుంది.
Next Story

