Wed Dec 17 2025 06:38:31 GMT+0000 (Coordinated Universal Time)
India vs South Africa : లక్నో మ్యాచ్ లోనూ టాస్ కీలకం కానుందా?
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ నేడు లక్నోలో జరగనుంది

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ నేడు లక్నోలో జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలుపు ఇరుజట్లకు అవసరం. ఇప్పటికే భారత్ సిరీస్ పై 2-1 ఆధిక్యతలో ఉంది. ఐదో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది. ఐదో మ్యాచ్ కు ముందే సిరీస్ ను సొంతం చేసుకోవాలంటే ఈరోజు జరిగే లక్నో మ్యాచ్ ను భారత్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. సిరీస్ సమం చేసి అహ్మదాబాద్ లో సిరీస్ కోసం పోరాడాలంటే దక్షిణాఫ్రికా పోరు సలపాల్సి ఉంటుంది. అందుకే భారత్, దక్షిణాఫ్రికా జట్లకు లక్నో మ్యాచ్ కీలకమని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఊపుమీద టీం ఇండియా...
టీం ఇండియా ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచి మంచి ఊపుమీద ఉంది. ఈ మ్యాచ్ లో కూడా టాస్ కీలకంగా మారనుంది. టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి. అందుకే ఈ మ్యాచ్ లోనూ టాస్ కీలకమే. భారత్ ను కొంత టాప్ ఆర్డర్ వైఫల్యం ఇబ్బంది పెడుతుంది. అభిషేక్ శర్మ ధర్మశాల మ్యాచ్ లో దంచి కొట్టినా, దూకుడుగా ఆడతాడు కాబట్టి ఎక్కువ బంతులు ఆడాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే శుభమన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ లు ఇద్దరూ మూడు మ్యాచ్ లలోనూ విఫలం కావడం ఆందోళన కరమే.
కసి మీద సౌతాఫ్రికా...
కానీ భారత్ బౌలర్లు కొంత పరవాలేదనిపిస్తుంది. అర్షదీప్, హర్షిత్ రాణా వికెట్లు వడివడిగానే తీస్తున్నారు. ఇక వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె లు వికెట్లు దొరకబుచ్చుకోవడం కూడా ఒక విధంగా శుభపరిణామమే. కులదీప్ యాదవ్ ను కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వికెట్లు తీస్తాడు. ఇలా బౌలింగ్ పరంగా పరవాలేదనిపిస్తున్నా నమ్మకంలేని పద్దు మాత్రమే. ఇక దక్షిణాఫ్రికా కసి మీదుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా భారత్ ను ఓడించాలని సౌతాఫ్రికా పట్టుదలతో ఉంది. అందుకే ఈ మ్యాచ్ మాత్రం క్రికెట్ ప్రేమికులకు మంచి కిక్కు ఇస్తుందనే చెప్పాలి.
Next Story

