Sat Mar 14 2026 16:04:27 GMT+0530 (India Standard Time)
అజారుద్దీన్ పై వేటు.. కారణమిదే
మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనర్హత వేటు వేసింది.

మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనర్హత వేటు వేసింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిర్ణయం తీసుకుంది. ఆయన గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో పాటు మరో సంస్థలో కూడా సభ్యత్వం ఉండటంతో ఓటర్ల జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది.
ఓటర్ల జాబితా నుంచి...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో రెండు వర్గాలున్నాయి. అజారుద్దీన్ ను సమర్థించే ఒక వర్గం, వ్యతిరేకించే మరొక వర్గం ఉంద. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మరోసారి హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా హెచ్సీఏ నిర్ణయం తీసుకుంది. ఆయన ఓటును ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని అజారుద్దీన్ కోల్పోయినట్లయింది.
Next Story

