Fri Dec 05 2025 17:34:31 GMT+0000 (Coordinated Universal Time)
India vs England Test : నేటి నుంచి భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్
భారత్ - ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కానుంది.

భారత్ - ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. సీనియర్లు లేకుండానే యువ ఆటగాళ్లు తొలిసారి టెస్ట్ క్రికెట్ లో అడుగు పెడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు లేకుండానే, అనుభవం తక్కువగా ఉన్న ఈ టీం విదేశీగడ్డపై ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి. ఇంగ్లండ్ జట్టుతో పోలిస్తే మనం అనుభవంలో చాలా జూనియర్లమే. శుభమన్ గిల్ సారథ్యంలో భారత్ జట్టు నేడు ఇంగ్లండ్ తో తలపడుతుంది. లీడ్స్ లో మ్యాచ్ మధ్యాహ్నం3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
అనుభవం లేకపోయినా...
టీం ఇండియా నెగ్గడం అంటే ఆషామాషీ కాదు. అయిదు మ్యాచ్ టెస్ట్ సిరీస్ కోసం భారత్ జట్టు ఇంగ్లండ్ ను నేడు ఢీకొంటుంది. కేవలం యువ ఆటగాళ్లు ఉంటేనే సరిపోదు. సరైన నాయకత్వమూ అంతే అవసరం. కొన్ని దశాబ్దాలుగా భారత్ ఇంగ్లండ్ లో పర్యటించినా అక్కడ మూడు సార్లు మాత్రమే గెలిచిన రికార్డులున్నాయి. అలాంటిది అనుభవం లేని ఈ జట్టు ఎంత మేరకు రాణిస్తుందన్నది చూడాలి. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు.అయితే విజయం సాధిస్తామన్న నమ్మకంతోనే తాము బరిలోకి దిగుతున్నామని కెప్టెన్ శుభమన్ గిల్ చెబుతున్నారు.
Next Story

