Fri Dec 05 2025 17:37:25 GMT+0000 (Coordinated Universal Time)
India vs Australia Test Match : నేటి నుంచి ఇండియా - ఆస్ట్రేలియా తొలి టెస్ట్
భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నేటి నుంచి జరగనుంది. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది

భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నేటి నుంచి జరగనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆతిథ్య ఆస్ట్రేలియాలో ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓటమి పాలవ్వడంతో జట్టు కొంత ఒత్తిడి మీద ఉంది. నేడు పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కొద్ది మార్పులతో భారత్ జట్టు ఆస్ట్రేలియా పై విజయం సాధించేందుకు సిద్ధమవుతుంది. ఆస్ట్రేలియా కూడా బలంగానే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఇరు జట్లు బలంగానే ఉన్నాయి.
కొద్దిగా మార్పులతో...
ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం భారత్ కు అంత సులువు కాదు. అదే సమయంలో నాలుగు టెస్ట్ మ్యాచ్ లు వరసగా గెలిస్తేనే అంతర్జాతీయ ఫైనల్స్ లో భారత్ అడుగు పెట్టే అవకాశముంది. అయితే ఈ టెస్ట్ కు భారత్ లో పలు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ, గాయాలతో గిల్ ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. దీంతో యువకులు ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొనాల్సి ఉంది. మరి చివరకు ఏం జరుగుతుందన్నది క్రికెట్ అభిమానులకు టెన్షన్ గా మారింది
Next Story

