Thu Mar 19 2026 01:10:16 GMT+0530 (India Standard Time)
నేడు భారత్ - వెస్టిండీస్ తొలి టీ 20 మ్యాచ్
భారత్ - వెస్టిండీస్ ల మధ్య తొలి టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగనుంది

భారత్ - వెస్టింస్ ల మధ్య తొలి టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ మ్యాచ్ కు ప్రేక్షకులకు అనుమతి లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
మూడు మ్యాచ్ లలో...
భారత్ వెస్టిండీస్ తో మూడు టీ 20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి మ్యాచ్ కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వెస్టిండీస్ తో ఆడిన మూడు వన్డే మ్యాచ్ లను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. వన్డేల మాదిరిగా టీ 20 లను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంది. టీ 20 పైచేయి సాధించాలని వెస్టిండీస్ కసితో ఉంది.
- Tags
- india
- west indies
Next Story

