Sat Mar 07 2026 20:59:43 GMT+0530 (India Standard Time)
India vs Srilanka : నేడు భారత్ - శ్రీలంక మొదటి వన్డే
నేడు భారత్ - శ్రీలంక మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. మొత్తం మూడు వన్డేల సిరీస్ నేటి మ్యాచ్ తో ప్రారంభం కానుంది.

నేడు భారత్ - శ్రీలంక మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. మొత్తం మూడు వన్డేల సిరీస్ నేటి మ్యాచ్ తో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు భారత్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
సీనియర్ ఆటగాళ్లతో పాటు...
విరాట్ కొహ్లితో పాటు సీనియర్ ఆటగాళ్లు కూడా వన్డే సిరీస్ లో ఆడనున్నారు. శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు భారత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగానే ఉంది. అదే సమయంలో శ్రీలంక జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. సొంత మైదానంతో పాటు టీ 20 సిరీస్ ను కోల్పోయిన కసి మీద లంక జట్టు ఉంది. అందుకే ఈ మ్యాచ్ అత్యంత కీలకమని చెప్పాలి. మూడు మ్యాచ్ లలో తొలి మ్యాచ్ లో ఎవరిది గెలుపు అన్నది ఉత్కంఠగా మారింది.
Next Story

