Sun Jan 11 2026 13:21:02 GMT+0000 (Coordinated Universal Time)
India vs Newzealand ODI : నేడు భారత్ - న్యూజిలాండ్ వన్డే
భారత్ - న్యూజిలాండ్ మధ్య నేడు తొలి వన్డే జరగనుంది.

భారత్ - న్యూజిలాండ్ మధ్య నేడు తొలి వన్డే జరగనుంది. వడోదర వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ జరగనుంది. మొత్తం మూడు వన్డే మ్యాచ్ లు భారత్ తో న్యూజిలాండ్ ఆడనుంది. 2027 లో జరగనున్న వన్డే వరల్డ్ ఛాంపియన్ ట్రోఫీకి ముందు జరిగే ఈ మ్యాచ్ లు ప్రాక్టీస్ లా మారనున్నాయి. మరొకవైపు ఈ మ్యాచ్ కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు అందుబాటులో ఉండనున్నారు. ఇద్దరు ఈ మ్యాచ్ లో మరొకసారి చెలరేగి ఆడే అవకాశాలున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు దుమ్ము దులిపారు.
మంచి ఫామ్ లో...
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా మ్యాచ్ తర్వాత జరిగిన దేశవాళీ క్రికెట్ లోనూ ఇద్దరూ తమ బ్యాట్ కు పదును పెట్టడంతో ఈ ఇద్దరిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్ లో భారత్ ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఆడే అవకాశాలున్నాయి. వన్ డౌన్ లో విరాట్ కోహ్లి రానున్నారు. ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు స్థానం కల్పించే అవకాశాలున్నాయి. వికెట్ కీపర్ బాధ్యతలను కేఎల్ రాహుల్ చూసుకోనున్నారు. అంటే ఈ జట్టు సీనియర్లు, యువ ఆటగాళ్లతో మిళితమైంది.
బలంగా ఉన్నప్పటికీ...
ఇండియా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా బలంగా ఉంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాష్టింగ్టన్ సుందర్ లతో బ్యాటింగ్ లైనప్ లంగా ఉంది. ఇక బౌలింగ్ పరంగా చూస్తే మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలతో పాటు కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. ఎటూ రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ లు రాణిస్తే బౌలింగ్ న్యూజిలాండ్ ను కట్టడి చేయవచ్చు. న్యూజిలాండ్ ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. అందుకే నేడు జరగనున్న వన్డే మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగనుంది.
Next Story

