Sun Feb 01 2026 10:08:44 GMT+0000 (Coordinated Universal Time)
రేపు శ్రీలంక - భారత్ తొలి వన్డే
భారత్ - శ్రీలంక తొలి వన్డే రేపు జరగనుంది. గౌహతిలో జరిగే ఈ తొలి వన్డేలో గెలుపు కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి

భారత్ - శ్రీలంక తొలి వన్డే రేపు జరగనుంది. గౌహతిలో జరిగే ఈ తొలి వన్డేలో గెలుపు కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఇప్పటికే టీ 20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్ నుకూడా సొంతం చేసుకోవాలని చూస్తుంది. అదే సమయంలో శ్రీలంకలో కూడా కసి పెరిగింది. వన్డే సిరీస్ ను దక్కించుకుని తమ సత్తా చూపాలని భావిస్తుంది.
సీనియర్లు రెడీ...
టీ 20లో విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి వన్డేలో ఆడతారు. సీనియర్ ఆటగాళ్లతో భారత్ బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ దిగే అవకాశాలున్నాయి. బౌలర్ల విషయంలో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశముంది. రెండు జట్లు ఇప్పటికే గౌహతికి చేరుకున్నాయి. అయితే భారత్ - శ్రీలంక వన్డే సందర్భంగా అస్సాం ప్రభుత్వం కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో పాఠశాళలకు ఒకరోజు సెలవు ప్రకటించింది.
Next Story

