Sun Dec 08 2024 08:54:35 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Srilanka First One Day : చేజేతులా తొలి మ్యాచ్ పోయిందిగా.. దీనికి కారణం వారేనా?
భారత్ - శ్రీలంక వన్డే మధ్య జరిగిన ఫస్ట్ వన్డే టై గా ముగిసింది. గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ చేజేతులా పోగొట్టుకుంది
భారత్ - శ్రీలంక వన్డే మధ్య జరిగిన ఫస్ట్ వన్డే టై గా ముగిసింది. గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ చేజేతులా పోగొట్టుకుంది. బ్యాటర్లు పూర్తిగా విఫలమవ్వడంతోనే ఈ పరిస్థిితి తలెత్తింది. టీ 20 సిరీస్ ను వైట్ వాష్ చేసిన టీం ఇండియా వన్డే మ్యాచ్ లో మాత్రం కొంత తడబడిందనే చెప్పాలి. రోహిత్ శర్మ ఉన్నంత సేపు మ్యాచ్ భారత్ వైపు ఉందనిపించింది. రోహిత్ అవుట్ అయిన వెంటనే ఇక వరస పెట్టి వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ ఇక మన సొంతం కాదని అర్థమవుతూనే ఉంది. ఒక దశలో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లక్ష్యాన్ని పూర్తి చేస్తారనుకుంటే వారు కూడా అవుట్ కావడంతో ఇక నిరాశ మిగిలింది.
టాస్ గెలిచి...
టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎనిమిది వికెట్లకు 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక బ్యాటర్లలో వెల్లలలాగే 67, నిశాంక 56 పరుగులు చేయగలిగారు. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు, అర్షదీప్ రెండు, కులదీప్ యాదవ్ ఒక వికెట్ తీయగలిగారు. నిజానికి యాభై ఓవర్ల మ్యాచ్ లో భారత్ కు ఇది పెద్ద లక్ష్యమేమీ కాదు. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ భారత్ కు బలంగా ఉంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబే వంటి వారితో పటిష్టంగా ఉండటంతో ఇదేమీ పెద్ద స్కోరు కాదనిపించింది. అందుకే పెద్దగా ఫ్యాన్స్ విజయం పై అనుమానం పెట్టుకోలేదు.
దూకుడుగా ఆడినా...
అనుకున్నట్లుగానే రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంత సేపు స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ మ్యాచ్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని అనిపించింది. రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతుండగా, శుభమన్ గిల్ ఆచి తూచి ఆడుతుండటంతో ఇక గెలుపు మనదేనని అనుకున్నారంతా. అయితే ఫస్ట్ గిల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు. రోహిత్ శర్మ 58 పరుగులు చేశాడు. తర్వాత కొహ్లి 24 పరుగులకు అవుటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 23 పరుగులకు వెనుదిరిగడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ 31, అక్షర్ పటేల్ 33 పరుగులు చేయడంతో విజయం మనదేనని అనుకున్నారు. కానీ 47.3 ఓవర్లకు స్కోరు సమమమయింది. ఒక్క పరుగు చేస్తే చాలు. కానీ అసలంక వరసగా రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చేతికి అందిన మ్యాచ్ చేజారి పోయింది
Next Story