Sat Dec 06 2025 00:52:36 GMT+0000 (Coordinated Universal Time)
రెండో టెస్ట్ లోనూ భారత్‌దే పైచేయి
బంగ్లాదేశ్ - భారత్ మధ్య రెండో టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

బంగ్లాదేశ్ - భారత్ మధ్య రెండో టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌట్ అయింది. మామినుల్ హక్ మాత్రమే 84 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 213 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఆ తర్వాత వరసగా వికెట్లు కోల్పోవడంతో 227 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
తొలి రోజు...
భారత బౌలర్లు అశ్విన్, ఉమేష్ లు చెరో నాలుగు వికెట్లు తీశారు. ఉనద్కత్ రెండు వికెట్లు తీయడంతో బంగ్లా కథ సమాప్తమయింది. తర్వాత బ్యాటింగ్ ను ప్రారంభించిన గిల్, రాహుల్ లు నిలకడగా ఆడుతున్నారు. కెఎల్ రాహుల్ మూడు పరుగులు, శుభమన్ గిల్ 14 పరుగులు చేయడంతో ఆట మొదటి రోజు ముగిసింది.
- Tags
- bangladesh
- india
Next Story

