Fri Dec 05 2025 13:27:57 GMT+0000 (Coordinated Universal Time)
సిరీస్ ఎవరిదో తేలేది నేడే
సిరీసీ గెలిచేందుకు చివరి మ్యాచ్ ఈరోజు జరగనుంది. భారత్ - శ్రీలంక మూడో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది

సిరీసీ గెలిచేందుకు చివరి మ్యాచ్ ఈరోజు జరగనుంది. భారత్ - శ్రీలంక మూడో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది. సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేకుండానే యువ జట్టు బరిలోకి దిగింది. తొలి మ్యాచ్ భారత్, రెండో మ్యాచ్ ను శ్రీలంక గెలుచుకుంది. ఈరోజు రాజ్కోట్ లో జరిగే మ్యాచ్ లో గెలుపపైనే సిరీస్ ఎవరిదన్నది ఆధారపడి ఉంటుంది. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. భారత్ జట్టు కొంత బౌలింగ్, బ్యాటింగ్ లో బలహీనంగా కనపడుతుంది. రెండో మ్యాచ్ లో ఇది అందరికీ స్పష్టమయింది.
ఓటమి నుంచి...
అయితే ఓటమి నుంచి తేరుకుని చివరి మ్యాచ్ లో సత్తా చూపించాలని భారత్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. శ్రీలంక జట్టు రెండో మ్యాచ్ గెలిచి ఆత్మ విశ్వాసంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అది పటిష్టంగా ఉంది. భారత్ గెలవాలంటే అన్ని ఫార్మాట్లలో సత్తా చూపాల్సి ఉంటుంది. అర్ష్దీప్ ను పక్కన పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. ఐదు నో బాల్స్ వేయడమే కాకుండా రెండో మ్యాచ్ లో అత్యధిక పరుగులు ఇచ్చి కేవలం రెండు ఓవర్లు మాత్రమే చేశాడు. మరో బౌలర్ తో బరిలోకి దిగుతుందా? లేక అదే జట్టు రాజ్కోట్ లో శ్రీలంకను ఎదుర్కొంటుందా? అన్నది చూడాలి. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story

