Fri Dec 05 2025 12:26:10 GMT+0000 (Coordinated Universal Time)
India - England Fith test : ఆశలన్నీ మన బౌలర్లపైనే.. ఏం చేస్తారో ఏమో?
ఇండియా - ఇంగ్లండ్ మధ్య ఓవల్ జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ భారత్ కు అనుకూలంగా మారింది.

ఇండియా - ఇంగ్లండ్ మధ్య ఓవల్ జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ భారత్ కు అనుకూలంగా మారింది. ఇక బౌలర్లపై పూర్తిగా భారం పడింది. బ్యాటర్లు బాగా ఆడి ఇంగ్లండ్ ముందు సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ స్కోరును ఉంచగలిగారు. ఓవల్ లో భారత్ ఆటగాళ్లు మంచి ప్రదర్వన చేశారు. ఈరోజు బౌలర్లు విజృంభిస్తే మాత్రం భారత్ కు ఈ మ్యాచ్ లో విజయం దక్కడం గ్యారంటీ. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే ఇంగ్లండ్ గడ్డ మీద భారత్ సిరీస్ ను సమం చేస్తుంది. డ్రాగా ముగిస్తే మాత్రం ఇంగ్లండకే సిరీస్ సొంతమవుతుంది. అందుకే ఈరోజు భారత్ కు కీలకమని చెప్పాలి. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ ఒక ఎత్తు... నేడు ఇంగ్లండ్ బ్యాటర్లను మన బౌలర్లు కట్టడి చేయగలిగి సరైన సమయంలో వికెట్ దొరకబుచ్చుకుంటే మాత్రం విజయం భారత్ దే అవుతుంది.
భారీ లక్ష్యమే...
రెండో ఇన్నింగ్స్ పూర్తయ్యే నాటికి నాలుగో రోజు ఇంగ్లండ్ ముందు భారత్ 374 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టపోయి యాభై పరుగులు మాత్రమే చేసింది. సిరాజ్ చేసిన బాల్ తో క్రాలీ పథ్నాలుగు పరుగుల వద్ద అవుటయ్యాడు. భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసి ఆల్ అవుటయింది. యశస్వి జైశ్వాల్ 118 పరుగులు చేసి ఈ టూర్ లో మరో సెంచరీని సాధించాడు. ఆకాశ్ దీప్ కూడా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 66 పరుగులు చేసి ఆకాశ్ దీప్ అబ్బురమనిపించాడు. జడేజా కూడా ఈ టూర్ లో మంచి ఫామ్ లో ఉండటంతో అర్ధ సెంచరీ చేశాడు. జడేజా 53 పరుగులు చేశాడు.
నేడు తేలిపోనుందా?
వాషింగ్టన్ సుందర్ కూడా ఆల్ రౌండర్ ప్రతిభను చాటుకున్నాడు. అర్ధశతకం చేసి అవుటయినా మిగిలిన వారితో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ భారత్ స్కోకుకు విలువైన పరుగులు జోడించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 247 పరుగులకే ఆల్ అవుట్ అయి భారత్ కంటే 23 పరుగులు ఆధిక్యతలో ఉన్నా ఈరోజు మాత్రం బౌల్లు విజృంభించి వికెట్లు దొరకబుచ్చుకుంటే మాత్రం గెలుపు భారత్ వైపు ఖచ్చితంగా మొగ్గు చూపుతుందని క్రీడానిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ బౌలర్లలో సిరాజ్, ఆకాశ్ దీప్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చెరి నాలుగు వికెట్లు తీయడంతో ఇప్పుడు కూడా వారిపైనే ఆశలున్నాయి. మరి మనోళ్లు మ్యాచ్ ను డ్రా చేస్తారా? లేక వికెట్లు వెంటవెంటనే తీసి భారత్ ను గెలిపించి సిరీస్ ను సమర్పిస్తారా? అన్నది నేడు తెలియనుంది.
Next Story

