Sun Mar 15 2026 12:31:03 GMT+0530 (India Standard Time)
నేడు రాహుల్ - అతియా పెళ్లి
ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం నేడు జరగనుంది.

ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం నేడు జరగనుంది. బాలీవుడ్ నటి అతియాశెట్టితో ఆయన వివాహం నేడు ముంబయిలో జరగనుంది. ఈ వివాహానికి ప్రముఖ బాలీవుడ్ నటీనటులతో పాటు క్రికెటర్లు కూడా హాజరయ్యే అవకాశముంది. ముంబైలోని ఖండాలాలోని ఫాంహౌస్ లో వీరి వివాహం జరగనుంది.
ఫోన్లను....
మూడు రోజుల నుంచి వీరి ప్రి వెడ్డింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వివాహ వేడుక ముగిసిన వెంటనే ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు ప్రస్తుత టీం ఇండియా ఆటగాళ్లు హాజరయ్యే అవకాశముంది. పెళ్లి వేడుకల్లో నో ఫోన్ పాలసీని అమలు చేస్తున్నారు. పెళ్లికి సంబంధించి ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా ఉండేందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు. ఫోన్లు లోపలికి అనుమతించడం లేదు. 2018 నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ నేడు ఒక్కటవుతున్నారు.
Next Story

