Sun Mar 15 2026 12:31:40 GMT+0530 (India Standard Time)
మూడు రోజుల పెళ్లి... రాహుల్..అతియా
ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం ఈ నెల 23వ తేదీన జరగనుంది. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి.

ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం ఈ నెల 23వ తేదీన జరగనుంది. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వద్ద ఈ వేడుకలను నిర్వహించనున్నారు. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి పెళ్లి కుమార్తె కావడంతో అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఈ నెల 23న....
ఈ వివాహానికి సినీ పరిశ్రమ, క్రికెట్ ప్రముఖులు హాజరుకానుండటంతో పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు జరగనుండటంతో ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి.
Next Story

