Fri Feb 27 2026 09:40:35 GMT+0530 (India Standard Time)
రింకూ సింగ్ ఇంట విషాదం
టీం ఇండియా క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో విషాదం నెలకొంది

టీం ఇండియా క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో విషాదం నెలకొంది. రింకూ తండ్రి ఖచంద్ర సింగ్ మృతి చెందారు. ఖచంద్ర సింగ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన గత కొంత కాలంగా లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దీంతో ఖచంద్ర సింగ్ కు ఉత్తర్ ప్రదేశ్ లోని యధార్థ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆరోగ్య క్షీణించడంతో...
అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మరణించారని వైద్యులు తెలిపారు. ఆయనకు కొన్ని రోజుల నుంచి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాలేయ క్యాన్సర్ నాలుగో స్టేజీకి వెళ్లడంతో వైద్యుల చికిత్స కూడా ఫలించలేదు. రెండు రోజుల క్రితం రింకూ సింగ్ ఆసుపత్రికి వెళ్లి తండ్రిని చూసి వచ్చారు. ఆయన టీ20 వరల్డ్ కప్ లో ఉండగా సమాచారం అందడంతో రింకూసింగ్ కు ఈ వార్త తెలిసింది.
Next Story

