Thu Mar 19 2026 10:08:24 GMT+0530 (India Standard Time)
నేడు కోవూరు పోలీసుల ఎదుటకు అనిల్ కుమార్ యాదవ్
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేడు కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కానున్నారు

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేడు కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కానున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై అనిల్ కుమార్ యాదవ్ కు కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి గత నెల 30వ తేదీన అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావాల్సి ఉంది.కానీ జులై 31వ తేదీన వైసీపీ అధినేత జగన్ పర్యటన నెల్లూరులో ఉండటంతో తాను విచారణకు రాలేనని అనిల్ కుమార్ యాదవ్ కు తెలిపారు.
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై...
దీంతో నాలుగో తేదీన విచారణకు రావాలని మరోసారి నోటీసులు పోలీసులు ఇచ్చారు. రేపు ఉదయం పది గంటలకు అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజు కావాల్సి ఉంది. అనిల్ కుమార్ యాదవ్ కూడా తాను నాలుగో తేదీన విచారణకు వెళతానని చెప్పారు. దీంతో విచారణలో పోలీసులు ఏం ప్రశ్నించనున్నారు? విచారణ చేసి వదిలేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.
News Summary - ex minister anil kumar yadav will appear for questioning at kovur police station today
Next Story

