Sun Feb 01 2026 11:26:27 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్ట్రేలియా ఆశలు గల్లంతు.. ఇంగ్లండ్ సెమీస్ కు
ఈరోజు జరగిన ఇంగ్లండ్ - శ్రీలంక మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించింది, ఆస్ట్రేలియా సెమీస్ కు చేరుకుండానే ఇంటిదారి పట్టింది

టీ 20 వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఆతిధ్య జట్టు ఆస్ట్రేలియా సూపర్ 12 నుంచే వెనుదిరిగింది. ఈరోజు జరగిన ఇంగ్లండ్ - శ్రీలంక మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించింది. శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. శ్రీలంక బ్యాటర్లు విఫలమయ్యారు. ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులే చేశారు. ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్ కు ఈ స్కోరు ఎంత మాత్రం లెక్క కాదు.
తక్కువ స్కోరు చేసినా...
శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ పథుమ్ నిస్సంక 67 పరుగులు చేశాడు. ఆ తర్వాత భానుక రాజపక్ష 22 స్కోరుకే అవుట్ అయ్యారు. అయితే తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించారు. లంక బౌలర్లు విజృంభించినా చివరకు ఇంగ్లండ్ విజయానికి అడ్డుకట్ట వేయలేకపోయింది. శ్రీలంక ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ నుంచి వైదొలిగినట్లే. ఇప్పటికే గ్రూప్ 1 లో న్యూజిలాండ్ సెమీస్ కు చేరుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్ సెమీస్ కు చేరుకోవడంతో ఆస్ట్రేలియా ఆశలు గల్లంతయ్యాయి.
Next Story

