Fri Dec 05 2025 17:50:09 GMT+0000 (Coordinated Universal Time)
ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన భారత్.. 319 పరుగులకే ఆల్ అవుట్
రాజ్‌కోట్ టెస్ట్ లో తొలిటెస్ట్ లో ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌట్ అయింది

రాజ్‌కోట్ టెస్ట్ లో తొలిటెస్ట్ లో ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం 126 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. రాజ్‌కోట్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. భారత్ బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయగలిగారు. సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే నాలుగు వికెట్లను తీయగలిగారు. సిరాజ్, జడేజా లు వికెట్లు తీయగలిగారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ను ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయగలిగింది.
ఆధిక్యంలో భారత్ ...
తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటర్లు రోహిత్ శర్మ, జడేజా సెంచరీలు చేయగా, సర్ఫరాజ్ ఖాన్ అర్థ సెంచరీ చేశారు. భారత్ తొలుత మూడు వికెెట్లు కోల్పోయినా తర్వాత రోహిత్, జడేజా నిలదొక్కుకోవడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోరును సంపాదించింది. తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ 319 పరుగులకే ఆల్ అవుట్ కావడంతో భారత్ 126 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ టెస్ట్ లో భారత్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
Next Story

