Sat Mar 07 2026 20:27:04 GMT+0530 (India Standard Time)
తొలి టీ 20 లో భారత్ విజయం

ఇంగ్లండ్ - భారత్ తొలి 20 లో భారత్ విజయం సాధించింది. యాభై పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలయింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. భారత్ బ్యాట్స్మెన్లలో హార్థిక్ పాండ్య 51 పరుగులు, సూర్యకుమార్ 39 పరుగులు చేశారు. భారత్ 20 ఓవర్లలో 198 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది.
148 పరుగులకే...
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 148 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో మొయిన్ ఆలీ అత్యధికంగా 36 పరుగులు చేశారు. 19.3 ఓవర్లలోనే భారత్ బౌలర్లు ఇంగ్లండ్ ను ఆలౌట్ చేసింది. హార్ధిక్ పాండ్యా నాలుగు వికెట్లను తీసి ఇంగ్లండ్ ను కుప్పకూల్చాడు. తొలి టీ 20ని భారత్ కైవసం చేసుకోవడంలో హార్థిక్ పాండ్యా కీలక పాత్ర పోషించారు.
Next Story

