Sun Mar 15 2026 14:07:43 GMT+0530 (India Standard Time)
కాలు విరిగింది.. తలకు గాయమైంది
టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడదల చేశారు

టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడదల చేశారు. పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. డెహ్రాడూన్ లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. డెహ్రాడూన్ మాక్స్ ఆసుపత్రిలో రిషబ్ పంత్ చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి రూర్కీ వెళుతుండగా కారు డివైడర్ ను ఢీకొనింది.
నిలకడగానే...
ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ కారు పూర్తిగా దగ్దమయింది. పంత్ కారు నుంచి బయటపడ్డారు. అయితే రిషబ్ పంత్ తలకు, కాలికి గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. కాలు ఫ్రాక్చర్ అయిందని వైద్యులు తెలిపారు. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి రావచ్చని వైద్యులు తెలిపారు. ఆయనకు ఎక్స్ రే తీసిన తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. పంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Next Story

