Fri Dec 05 2025 23:14:34 GMT+0000 (Coordinated Universal Time)
దివ్య దేశముఖ్.. సరికొత్త చరిత్ర సృష్టించింది?
భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా 19 ఏళ్ల దివ్య రికార్డు నెలకొల్పింది.

భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా 19 ఏళ్ల దివ్య రికార్డు నెలకొల్పింది. జార్జియాలో జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో దివ్య 1.5–0.5తో 2017 ప్రపంచ చాంపియన్, చైనాకు చెందిన టాన్ జోంగిపై గెలిచింది. బుధవారం జరిగిన రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన దివ్య 101 ఎత్తుల్లో టాన్ జోంగిని ఓడించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయంతో దివ్య వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. భారత్ కు చెందిన కోనేరు హంపి, చైనాకు చెందిన లె టింగ్జి మధ్య సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో దివ్య ఆడుతుంది.
Next Story

