Fri Dec 05 2025 13:18:03 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : రివెంజ్ వీక్ లో గెలుపు ఎవరిదో?
ఈరోజు ఐపీఎల్ లో రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఢీకొంటుంది. మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది

ఐపీఎల్ సీజన్ 18 జోరుగా నడుస్తుంది. శని, ఆదివారాలు వస్తే క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే. ఎందుకంటే ఈ రెండు రోజులు రెండు మ్యాచ్ లు అభిమానులను అఅలరిస్తాయి. ఇప్పటికే సగం సీజన్ ముగిసింది. అయితే ఇప్పటి వరకూ ప్లే ఆఫ్ కు వచ్చే జట్లు ఏవన్నదానిపై ఇంకా క్లారిటీ రాకున్నప్పటికీ రానున్న మ్యాచ్ లలో ఎవరిది పై చేయి అవుతుందో వారే ప్లే ఆఫ్ కు చేరుకుంటారు. కొన్ని జట్లు ఆరంభంలో చతికిలపడి తర్వాత పుంజుకుంటుంటే, మరికొన్ని జట్లు మాత్రం ప్రారంభంలో మంచి పెర్ ఫార్మెన్స్ చూపి తర్వాత ఇబ్బంది పడుతున్నాయి.
నేడు రెండు కీలక మ్యాచ్ లు...
ఈరోజు ఐపీఎల్ లో రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఢీకొంటుంది. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంలకు మ్యాచ్ జరగనుంది. ఇక రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. జైపూర్ లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లలో ఓటమి నుంచి తేరుకుని తమపై గెలిచిన జట్లపై పగ తీర్చుకోవడానికి రెడీ అయ్యాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలిచి రెండింటిలో ఉడి టేబుల్ టాప్ 3లో ఉంది. ఢిల్లీ ఆరు మ్యాచ్ లలో ఐదింటిలో గెలిచి ఒక మ్యాచ్ లో గెలిచి టేబుల్ టాప్ లో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ఏడు మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలిచి మూడింటిలో ఓటమి పాలు కాగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడి రెండింటిలోనే గెలిచి ఐదింటిలో ఓడి టేబుల్ లో ఆఖరిలో ఉంది. మరి ఈరోజు గెలుపు ఎవరిదన్నది ఉత్కంఠగా మారనుంది.
Next Story

