Wed Jul 16 2025 23:45:49 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : నేడు ఐపీఎల్ లో కీలకం.. రెండు జట్లు బలమైనవే.. గెలుపెవరిదో?
నేడు ఐపీఎల్ లో కీలక మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఒకరకంగా ఇది సెమీ ఫైనల్స్. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్స్ కు. ఓడితే ఇక ఇంటికే. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమే. ఇప్పటికే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఫైనల్స్ కు చేరుకుంది. ఇక నేడు పంజాబ్ కింగ్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడుతుంది. ఎలమినేటర్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓడి ఒకింత నిరాశలో ఉంది. కొంత టీంలో కాన్ఫిడెన్స్ దెబ్బతినింది. ఇక ముంబయి ఇండియన్స్ జోరు మాత్రం తగ్గడం లేదు. ప్లేఆఫ్ రేసులోకి అనూహ్యంగా దూసుకు రావడమే కాకుండా.. గుజరాత్ టైటాన్స్ ను ఓడించడంతో పూర్తిగా ముంబయి జట్టులో ఆత్మవిశ్వాసం కపడుతుంది. ఆరో సారి కప్పు తమదేనన్న ధీమా ఆ జట్టులో కనిపిస్తుంది.
తక్కువగా అంచనా వేయడానికి...
నేడు ఐపీఎల్ లో కీలక మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయిర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. అయితే పంజాబ్ కింగ్స్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. బెంగళూరు పై ఆడుతున్న సమయంలో ఆ జట్టుకు అదృష్టం కలసి రాకపోవడంతో తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయింది. అయితే అన్ని సార్లు అదే రకంగా జరుగుతుందని అనుకోవడానికి వీలులేదు. అందులోనూ పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకూ సమిష్టిగా రాణిస్తూ వస్తుంది. మంచి ఫామ్ లో ఉన్న ఆ జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఫైనల్స్ కు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన జట్టు ఉండటం పంజాబ్ కింగ్స్ కు సానుకూలం.
ఆరంభంలో ఇబ్బందులు పడినా...
ఇక ముంబయి ఇండియన్స్ అయితే ఆరోసారి ఛాంపియన్ షిప్ ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతుంది. ఆ జట్టు ఆరంభంలో ఇబ్బందులు పడినా ఇక తర్వాత ముంబయిని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. ముంబయి జట్టు కొంత బ్యాటింగ్ లో మొన్నటి వరకూ తడబడుతున్నప్పటికీ ఇప్పుడు తేరుకుంది. రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఎటూ ఉండనే ఉన్నారు. ఇక తిలక్ వర్మ లాంటి వాళ్లు నిలదొక్కుకుంటే చాలు.. ఎంతటి లక్ష్యాన్ని అయినా సులువుగా ఛేజ్ చేయగల సత్తాతో దూసుకు వస్తుంది. ముంబయి ఇండియన్స్ లో బుమ్రా ఉండగా దిగులెందుకు అన్నట్లు అవసరమైన సమయంలో వికెట్లు తీసి జట్టుకు సాయ పడుతున్నాడు. అందుకే రెండు జట్లు మంచి బలమైనవి కావడంతో నేడు సండే క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ మ్యాచ్ మంచి కిక్కు ఇస్తుందని అనుకోవాలి.
Next Story