Fri Dec 05 2025 12:41:41 GMT+0000 (Coordinated Universal Time)
ఛతేశ్వర్ పుజారా రిటైర్ మెంట్
క్రికెట్ నుంచి ఛతేశ్వర్ పుజారా రిటైర్ మెంట్ ప్రకటించారు. ఛతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

క్రికెట్ నుంచి ఛతేశ్వర్ పుజారా రిటైర్ మెంట్ ప్రకటించారు. ఛతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. గత దశాబ్దన్నర కాలంగా టీం ఇండియాలో చోటు దక్కించుకుంటున్న ఛతేశ్వర్ పుజారా తాను క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఛతేశ్వర్ పుజారా అనేక సార్లు టీం ఇండియాను ఆదుకున్నారు.
ఎన్నో పరుగులు...
ఛతేశ్వర్ పుజారా 2010 సంవత్సరం నుంచి 2023 వరకు టీమిండియాకు ఆడి భారత్ తరపున 103 టెస్టులు, 5 వన్డేలు ఆడారు. సెంచరీలు చేశాడు. అర్థసెంచరీలు కూడా చేశాడు. భారత్ తరుపున ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ను ఆడాడు. నయావాల్ గా పేరుపొందిన ఛతేశ్వర్ పుజారా మూడు డబుల్ సెంచరీలు, పందొమ్మిది సెంచరీలు, ముప్ఫయి ఐదు అర్ధసెంచరీల సాయంతో 7,195 పరుగులు చేశాడు. చివరిగా 2023లో భారత్ తరుపున ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్ ఆడిన ఛతేశ్వర్ పుజారా చివరకు రిటైర్ మెంట్ ప్రకటించాడు.
Next Story

