Fri Sep 13 2024 08:11:47 GMT+0000 (Coordinated Universal Time)
INDvsSL: శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?
భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం
భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం చరిత్ అసలంక నేతృత్వంలోని 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలిగిన వనిందు హసరంగ స్థానంలో అసలంక కు అవకాశం ఇచ్చింది. అనుభవజ్ఞుడైన ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా లకు జట్టులో చోటు దక్కలేదు. దినేష్ చండిమాల్, కుసాల్ జనిత్ పెరీరా తిరిగి జట్టులోకి వచ్చారు. టీ20 ప్రపంచ కప్ లో శ్రీలంక దారుణంగా ఆడడంతో పలు మార్పులు ఆ జట్టులో చోటు చేసుకున్నాయి. సదీర సమరవిక్రమ, దిల్షాన్ మధుశంక లను తప్పించగా.. అన్క్యాప్డ్ 21 ఏళ్ల చమిందు విక్రమసింఘే, బినుర ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండో టీమ్ లోకి వచ్చారు.
లంకన్ ప్రీమియర్ లీగ్‌లో అసలంక జాఫ్నా కింగ్స్ కు టైటిల్ అందించాడు. శ్రీలంక ఆటగాళ్లలో అవిష్క అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కుశాల్ పెరెరా కూడా 169 స్ట్రైక్ రేట్ తో 296 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఎడమ చేతి సీమర్ బినురా ఫెర్నాండో LPLలో ఎనిమిది మ్యాచ్ లలో 13 వికెట్లు తీసి జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. అమెరికా- వెస్టిండీస్‌లలో జరిగిన ప్రపంచ కప్ మొదటి రౌండ్లో పరాజయం పాలైన తర్వాత శ్రీలంకకు ఇది మొదటి T20I సిరీస్. నాలుగు రోజుల పాటు జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత్‌తో శ్రీలంక తలపడనుంది. జూలై 27 నుండి పల్లెకెలెలో మ్యాచ్ లు జరగనున్నాయి.
శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (సి), పాతుమ్ నిస్సాంక, కుసల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమాంత, మఠిషా తీక్షన, డి నుష్మాంత్ విక్రమసింగ్ చమీర, బినూర ఫెర్నాండో
Next Story