Fri Dec 05 2025 22:46:21 GMT+0000 (Coordinated Universal Time)
141 ఏళ్ల రికార్డు బద్దలు.. దటీజ్ స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన టెస్టు కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు

ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన టెస్టు కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో విదేశీ బ్యాటర్‌గా అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 575 పరుగులు చేసిన స్మిత్ సర్ డాన్ బ్రాడ్‌మన్, సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్‌లను అధిగమించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన స్మిత్ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ చారిత్రక రికార్డును నెలకొల్పాడు. స్మిత్ ఈ మ్యాచ్ లో 111 బంతుల్లో 66 పరుగులు చేశాడు.
లార్డ్స్‌లో స్మిత్ ఇప్పటివరకు మూడు అర్ధసెంచరీలు, రెండు సెంచరీలు కొట్టాడు. తాజా ఇన్నింగ్స్‌తో కలిపి లార్డ్స్‌లో ఐదు సార్లు 50కి పైగా పరుగులు స్మిత్ చేశాడు. ఈ మైదానంలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన విదేశీ బ్యాటర్ రికార్డును కూడా స్మిత్ సమం చేశాడు.
Next Story

